ఫిప్ల్ కార్ట్‌లో Poco X2 స్మార్ట్ ఫోన్ సేల్

ఫిప్ల్ కార్ట్‌లో Poco X2 స్మార్ట్ ఫోన్ సేల్

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి ఇటీవలే భారత మార్కెట్లోకి Poco X2 స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ మోడల్ ఫోన్ షావోమీ రెడ్ మి k30 రీబ్రాండెడ్ మాత్రమే కాదు.. మరో పోటీదారు కంపెనీ రియల్ మి X2కు గట్టిపోటిని ఇస్తోంది. వారం క్రితమే లాంచ్ అయిన ఈ మోడల్ ఫోన్ Poco X2, ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌లో మొదటి సేల్ ప్రారంభమైంది. ఇండియాలో ఆన్‌లైన్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. 

Poco X2 మోడల్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.15,999గా నిర్ణయించారు. ఇక 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. మరో వేరియంట్ 6GB ర్యామ్, 128GB ఇన్ బుల్ట్ స్టోరేజీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.16,999గా నిర్ణయించింది. ఇక మరో వేరియంట్ ప్రారంభ ధర రూ.19,999గా ఉంది. ఆ హ్యాండ్ సెట్ 8GB ర్యామ్, 256GB ఆన్ బోర్డు స్టోరేజీ ఉంది. ప్రస్తుతం ఈ Poco X2 స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ICICI బ్యాంకు కార్డు లేదా ICICI కార్డుపై EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. POCO X2 మొదటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో 120Hz డిస్‌ప్లేతో మెయిన్ హైలెట్ గా ఉంది. ఈ డివైజ్ స్పోర్ట్స్ 6.67 అంగుళాల Full HD+డిస్‌ప్లేతో డ్యుయల్ పంచ్ హోల్స్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ అమర్చారు. కెమెరా డిపార్ట్ మెంట్‌లో ఫోన్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ (64MP, 8MP, 2MP, 2MP) ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలు వచ్చేసి 20MP, 2MP రెండు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 4,500mAh బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ MIUI 11 ఆధారిత ఆండ్రాయిడ్ 10 రన్ అవుతోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది.