రోడ్డుపై టిక్‌టాక్‌... వెంట‌నే అరెస్ట్‌... కార‌ణం

రోడ్డుపై టిక్‌టాక్‌... వెంట‌నే అరెస్ట్‌... కార‌ణం

 

పిచ్చి ప‌లు ర‌కాలు అన్న సామెత క‌నుమ‌రుగ‌వుతోంది... పిచ్చి ప‌లు టిక్‌టాక్‌లు అన్న సామెత పుట్టుకొస్తుంది.. ప్ర‌తి 10 టిక్ టాక్ వీడియోల‌లో రెండు వెకిలి చేష్ట‌ల‌తో.. మ‌రో రెండు హింస‌తో.. మ‌రో రెండు అశ్లీల‌త‌తో ఉంటున్నాయి. అందుకే టిక్ టాక్ హేట‌ర్స్ అంతా టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చెయ్యాల‌ని కోరుకుంటున్నారు.. అయితే టిక్ టాక‌ర్స్ మాత్రం బ్యాన్ చెయ్య‌కూడ‌ద‌ని కోరుకుంటున్నారు.

అయితే, ‘టిక్‌టాక్’ స్టార్ అని చెప్పుకొనే ఈ యువతి చేసిన వీడియో చూస్తే.. మీరు కూడా ‘టిక్‌టాక్’ బ్యాన్ చేయడమే ఉత్తమం అని అంటారు. 

అహ్మదాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల సోను నాయక్‌కు టిక్‌టాక్‌లో ఓ మిలియన్ అభిమానులు ఉన్నారు. దీంతో ఆమె సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులను అలరించేందుకు వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోంది. అయితే, తన వీడియోలు మరింత వెరైటీగా ఉండాలనే ఉద్దేశంతో సోమవారం రాత్రి 9 గంటలకు ఆమె లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇసాన్‌పూర్ వంతెన వద్దకు వెళ్లింది. అక్క‌డ టిక్ టాక్ చేసి పోస్ట్ చేసింది.

‘‘మోడీగారు ఇది మా ఇసాన్‌పూర్ వంతెన. లాక్‌డౌన్ ఎత్తేయండి’’ అని నవ్వుతూ వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పోలీసులకు చిక్కాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు.