నా భర్తను టెర్రరిస్టు‌ను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారు: గీత

0
314
Revanth-Arrest-Telangana-Elections

రేవంత్‌రెడ్డిని అన్యాయంగా అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని ఆయన భార్య గీత ఆరోపించారు.ఈ ఘటనను చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని అనిపిస్తోందన్నారు.తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తామేమన్నా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు.

కొడంగల్ ప్రజలు సంయమనం కోల్పోవద్దు

రేవంత్‌ అరెస్ట్‌పై ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ఆమె పిలుపునిచ్చారు. టెర్రరిస్టులను ఈడ్చుకెళ్లినట్లు తన భర్తను దౌర్జన్యంగా పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు సంయమనం కోల్పోవద్దంటూ గీత పిలుపునిచ్చారు. నియంతకు ప్రజాస్వామ్యయుతంగా బుద్ధి చెబుతామని ఆడియో ద్వారా సందేశమిచ్చారు. రేవంత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కొడంగల్ ఆత్మగౌరవం చాటుదామని గీత అన్నారు.