మంత్రి హరీశ్‌రావు వాహనాన్నితనిఖీ చేస్తున్న పోలీసులు..!

0
131
Minister Harish Rao

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. పోలీసులకు పూర్తిగా సహకరించిన మంత్రి.. ఎవరి డ్యూటీ వారు చేయాలని, ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. హరీశ్‌ వాహనంలో ఎటువంటి నగదు లభించలేదు.

ఇదిలా ఉండగా.. కరీంనగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.12 లక్షల నగదు పట్టుబడింది. హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ.10 లక్షలు లభించాయి. మహంకాళి పోలీసులు ఓ వ్యక్తి నుంచి 29 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద రూ.2.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కోదాడలో రూ.9 లక్షలు, మంచిర్యాల జిల్లాలో రూ.7 లక్షలు, గజ్వేల్‌లో రూ.1.70 లక్షలు, పిడిచెడ్‌ చౌరస్తాలో రూ.3.90 లక్షలు, జగదేవ్‌పూర్‌లో రూ.4.60 లక్షల నగదు లభ్యమయ్యాయి. కేసీఆర్‌ను గద్దె దించాలనే నినాదాలతో కూడిన కరపత్రాలను ఓ కారులో తీసుకెళ్తుండగా ఐనవోలు మండలం పంథినిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పట్టుకుంది.