స్పెయిన్ పోలీసుల వినూత్న ప్ర‌య‌త్నం మ‌న‌సు గెలుచుకుంది

స్పెయిన్ పోలీసుల వినూత్న ప్ర‌య‌త్నం మ‌న‌సు గెలుచుకుంది

 

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలో ఏ దేశానికీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప‌దం.. క‌రోనా గురించి కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు, కేవ‌లం అది ఎలా వ్యాపించ‌దో అనేది త‌ప్ప.. 

 మనసున్న పోలీసులు.. గిటారు వాయిస్తూ వీధుల్లో డ్యాన్సులు, ప్రజల్లో ఉత్సాహం కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే, అలా ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉండటం వల్ల కుంగుబాటు, ఆందోళన పెరుగుతుందనే ఉద్దేశంతో స్పెయిన్ పోలీసులు కొత్త అవతారం ఎత్తారు. 

పోలీసులంటే రక్షణ కల్పించడమే కాదని, వీలైతే ప్రజల్లో ఆనందోత్సాహాలు కూడా కలిగించాలని తెలియజెబుతున్నారు. గీటారుతో వీధుల్లో తిరుగుతూ.. డ్యాన్సులు చేస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మీరు క్షేమంగా ఉండటమే మాకు కావాలని, కొద్ది రోజులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరుకుంటున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇప్పుడో విష‌యం నెట్టింట్లో చెక్క‌ర్లుకొడుతుంది... అదేటంటే  కరోనా వైరస్ అనేది చైనా స్వయంగా సృష్టించిన వైరస్ అని విదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు బలమైన కారణం ఉందంటున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న చైనా... తమ దేశంలో విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడిదారుల్ని ఎలా పంపించేయాలో తెలియక... ఈ వైరస్‌ని సృష్టించిందని ఆరోపిస్తున్నాయి.