కాంగ్రెస్‌కు చావో రేవో…టీఆర్‌ఎస్‌ తోనే ప్రధాన పోటీ..!

0
154
Ponnam Prabhakar

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి చావో రేవో పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్‌ కనీసం 75 సీట్లు గెలుచుకుంటుందని, మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్యే ప్రధాన పోటీ అని చెప్పారు. మహాకూటమి కేవలం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపైనే పోరాడటం లేదని.. కేసీఆర్‌ అర్ధబలం, బీజేపీ నేతృత్వంలోని మతోన్మాద శక్తులపై పోరాడుతోందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల వేధింపులను తట్టుకోలేక చాలామంది కాంగ్రె్‌సలో చేరుతున్నారని కూడా ఆయన తెలిపారు.మరి గెలుపెవరదో తెలియాలంటే ఎన్నికలు వరకు వేచి చుడాలసిందే.