విరాళం ప్రకటింటిన పవర్ స్టార్!

విరాళం ప్రకటింటిన పవర్ స్టార్!

 

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా  మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ లు ఎంతో కృషి చేస్తున్నాయి. కఠినంగా కూడా వ్యవహరిస్తున్నాయి. తెలుగు ప్రజలు ఇబ్బందులు పడకుండా తమవంతు సహాయంగా సినిమా రంగం నుంచి విరాళాలు అందుతున్నాయి. 

ఇప్పటికే నితిన్ తెలంగాణ కు రూ.10 లక్షలు, ఏపీకి రూ.10 లక్షలు తనవంతు సాయంగా అందచేశాడు.  దర్శకుడు వీవీ.వినాయక్ కూడా నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం ట్రస్ట్ ద్వారా సేవచేయడానికి 5 లక్షలు ప్రకటించారు.

అయితే  ప్రతి విషయంపై స్పందించే పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, ఏపీకి రూ. 50 లక్షలు కరోనా నివారణ కోసం అందజేశారు.  సినిమా నటుడు, రాజకీయ పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఈ విరాళాన్ని మాత్రం సినిమా నటుడుగానే ప్రకటించారు.

పార్టీ పరంగా కార్యకర్తలతో ఇప్పటికే సేవకార్యక్రమాలు ప్రారంభించారు. జనసేన పార్టీ తరుపున ముందు ముందు పవన్ ఎటువంటి కార్యక్రమాలు చేపడతార‌నేది త్వరలో ప్రకటించనున్నారు.