లాక్‌డౌన్ మాకొద్దు... వినూత్న నిర‌స‌న‌

లాక్‌డౌన్ మాకొద్దు... వినూత్న నిర‌స‌న‌

 

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోకి ప్ర‌వేశించాక లాక్ డౌన్ ప్ర‌జ‌ల జీవితాల్లోకి బ‌ల‌వంతంగా ప్ర‌వేశించింది. లాక్‌డౌన్ ని చాలా మందే వ్య‌తిరేకించారు... కానీ లాక్‌డౌన్‌లో ఉండ‌క త‌ప్ప‌లేదు. అయితే క‌రోనా వైర‌స్ వ‌చ్చి నెల‌లు దాటుతోంది, లాక్‌డౌన్ మొద‌లై కూడా చాలా రోజులు అవుతుంది. 

అయితే కరోనా కారణంగా అమెరికాలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.  ఈ లాక్‌డౌన్ నిబంధనలను అక్కడి ప్రజలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని, బంధించడానికి వీలులేదని రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని దవీద సాల్ అనే స్థానిక పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ప్రభుత్వ నిబంధనలను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కరోనా మాస్కులతో తయారుచేసిన టూ పీస్ బికినీ ధరించి ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్ విధించడం సరైన పద్ధతి కాదని, వెంటనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. తాను ఈ విధంగా నిరసించడంపై అందరూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని దావిదా పేస్‌బుక్ ద్వారా కోరారు.

ఈ ప‌ద్ధ‌తిలో నిర‌స‌న తెలాప‌డం చాలా బాగుంద‌ని కొంద‌రు ఆక‌తాయిలు కామెంట్లు పెట్టారు.