సర్కార్’ వివాదంపై రజనీకాంత్ రెస్పాన్స్..!!

0
124
Vijay Sarkar

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన చిత్రం ‘సర్కార్’. నవంబర్ 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూనే.. వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. తమిళనాడు ప్రభుత్వంలోని అన్నాడీఎంకేకు చెందిన కొందరు మంత్రులు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు తమిళనాడులోని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాజాగా ‘సర్కార్’ సినిమాపై జరుగుతున్న పరిణామాల పట్ల స్పందించిన రజనీకాంత్.. సినిమా నిలిపివేయాలంటూ సదరు పార్టీలు చేస్తున్న పోరాటాన్ని ఖండించారు. ‘‘ఒకసారి సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతించి, సినిమా విడుదలయ్యాక.. అందులోని కొన్ని సన్నివేశాలు నిలిపేయాలంటూ వారు చేస్తున్న పోరాటం పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి చర్యలను నేను ఖండిస్తున్నా’’ అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు రజనీకాంత్. మరోవైపు ఇప్పటికే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయిన ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు.