దీపావళి వెలుగుల్లో రానున్న రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌..!!

0
28
Ram charan boyapati srinu movie

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అడ్వాణీ కథానాయిక. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ అనే పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌, సినిమా పేరు టపాసుల వెలుగులతోపాటే బయటకొస్తుందన్న మాట. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. వివేక్‌ ఒబెరాయ్‌తో పాటు ప్రశాంత్‌, స్నేహ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. బోయపాటి తరహా యాక్షన్‌, మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.