దీపావళి కానుకగా ఫాన్స్ కు చెర్రీ ఫస్ట్ లుక్

0
129
rc12 first look

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై చెర్రీ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా మరో అప్‌డేట్‌ని ఫ్యాన్స్‌కు అందించింది. దీపావళి కానుకగా ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 9న ఉదయం 10.25 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.