“వినయ విధేయ రామ” టీజర్‌ వచ్చేసిందోచ్..!!

0
35
Vinaya Vidheya Rama Teaser

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్ర టీజర్‌ వచ్చేసింది. ‘అన్నయ్యా..వీడిని చంపేయాలా? భయపెట్టాలా?’ భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పావుగంట.. ఏదైనా ఓకే. సెలెక్ట్‌ చేస్కో’ అంటూ రామ్‌చరణ్‌ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ చెప్తున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. టీజర్‌లో సినీ నటుడు ప్రశాంత్‌ను ఎవరో బెదిరిస్తుంటే.. అతన్ని కాపాడేందుకు చరణ్‌ వెళ్తాడు. అప్పుడు చరణ్‌..‘రేయ్‌.. పందెం పరశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్‌..రామ్‌..రామ్‌ కొణిదెల’ అని బల్ల గుద్ది చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.
బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.