రతన్ టాటా నీ "చోటు" అన్న యువతి.. నెటిజన్స్ ఫైర్‌.. ఆదుకున్న‌ రతన్ టాటా

 రతన్ టాటా నీ "చోటు" అన్న యువతి.. నెటిజన్స్ ఫైర్‌.. ఆదుకున్న‌ రతన్ టాటా

ఇటీవలే టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా అతని ఫోటో పెట్టి తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ, ఆన్లైన్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపాడు. కమ్యునిటిలో భాగం అయినందుకు సంతోషిస్తున్నాను అని ఇంకా ఈ ప్రయాణం ఇలాగే సాగాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఆ పోస్ట్ చూసిన ఒక యువతి "శుభాకాంక్షలు చోటు" అని లాస్ట్ లో హార్ట్ ఇమోజీ తో కామెంట్ పెట్టగా నెటిజన్లు యువతి పై ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే రతన్ టాటా తానే వచ్చి ఒక రిప్లై పెట్టాడు అంతే దానితో అందరూ రతన్ టాటా చూపిన రెస్పెక్ట్ కి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

 

రతన్ టాటా నీ "చోటు" అన్న యువతి.. నెటిజన్స్ ఫైర్‌.. ఆదుకున్న‌ రతన్ టాటా 

 

ఇంతకీ ఆ రిప్లై ఏంటి అంటే, "మన అందరిలోనూ ఒక పిల్లవాడు ఉంటాడు. దయచేసి ఆ యువతిని రెస్పెక్ట్ తో మాట్లాడండి" అని పెట్టారు. కొద్ది సమయం తరువాత ఆ యువతి త‌న‌ కామెంట్ ని డిలీట్‌ చెయ్యడం తో రతన్ టాటా తను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో "ఒక యువతి తన సెంటిమెంట్ నీ వ్యక్తం చేసింది.. నన్ను కిడ్ అని కామెంట్ చేసింది. అందుకు తను అమర్యాద పాలు అయ్యింది. దానితో తను ఆ కామెంట్ నీ డిలీట్‌ చేసింది. నేను తన హృదయపూర్వక నోట్ ని అభినందిస్తున్నాను. ఇంకోసారి తను వెనుకకు తగ్గకుండా మళ్లీ పోస్ట్ చేస్తుందని ఆశిస్తున్నా ను" అని రాసారు. ఇలా అందరి మనసులు దోచుకున్నారు. 

రతన్ టాటా గత ఏడాది అక్టోబరు లో ఇన్‌స్టాగ్రామ్ లో జాయిన్‌ అవ్వగా... ఇప్పటికే అందరి మనసులను దోచుకుంటున్నారు. ఇటీవల తన య‌వ్వ‌నం లోని ఒక ఫోటో తో ఇంటర్నెట్ ని బ్రేక్ చేశారు.