Realme Days సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు

Realme Days సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు

 

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి 'Realme Days' సేల్ మొదలైంది. మార్చి 19 నుంచి మార్చి 22 వరకు సేల్ కొనసాగనుంది. రియల్‌మి సొంత వెబ్‌సైట్, భాగస్వామి వెబ్‌సైట్లలో - Flipkart, Amazon,TataQliqలో ఈ సేల్ జరుగుతుంది. రియల్‌మి సేల్‌లో భాగంగా సంస్థ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ఇస్తోంది. సేల్స్ జాబితాలో చేర్చిన స్మార్ట్‌ఫోన్‌ల్లో రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో , రియల్‌మి 5, రియల్‌మి 5 ప్రో, రియల్‌మి ఎక్స్‌, రియల్‌మి XT, రియల్‌మి X2, రియల్‌మి X2pro వంటి మరిన్ని ఫోన్ల మోడల్స్ ఉన్నాయి. అలాగే, రియల్‌మి 6 ఓపెన్ సేల్‌తో పాటు మొత్తం ఆఫర్‌లో వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుంది. 

ఓల్డ్ ఫోన్లకు బదులుగా ఎక్సేంచ్ కింద కొత్త రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు రియల్‌మి అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. ఇవి రియల్‌మి X2, రియల్‌మి X2 pro హ్యాండ్‌సెట్లలో లభిస్తాయి.

 అంటే వినియోగదారులు పాత డివైజ్‌కు బదులుగా రియల్‌మి X2 (4GB + 64GB)ను రూ .14,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ హ్యాండ్‌సెట్ వేరియంట్‌లలో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ద్వారా వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో SBI క్రెడిట్ కార్డులు & EMI లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

రియల్‌మి 5, 5 ప్రో మోడళ్ల కోసం.. రియల్‌మి, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, TataQliqలలో వినియోగదారులు 5 Pro (వేరియంట్లలో) రూ. 1,000 ఆఫ్ పొందవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో 5 Pro 6GB + 64GB, 8GB+ 128GB వేరియంట్లలో రూ.1000 అదనపు ప్రీపెయిడ్ ఆఫర్లు ఉన్నాయి. రియల్‌మి 5 వేరియంట్లు రూ .500 తక్కువ ధరకే లభిస్తాయి. రియల్‌మి XT, రియల్‌మి X స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, TataQliq వెబ్‌సైట్లలో వరుసగా రూ .1000, రూ .2,000 తగ్గింపు ధరకే పొందవచ్చు.