Realme పార్టనర్ పేరుతో ఫ్రాడ్!

Realme పార్టనర్ పేరుతో ఫ్రాడ్!

ఇప్పుడంతా డిజిటల్ మయం. ఈ డిజిటల్ వరల్డ్‌లో రోజురోజుకీ ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. స్కామర్లు, సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తదారులను వెతుకుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఆన్ లైన్ వినియోగదారులను ఫుల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆన్ లైన్ మాయగాళ్ల వలలో పడి అమాయకులే ఎక్కువగా మోస‌పోతుంటారు. స్కామర్ల మాటలు నమ్మి విలువైన డబ్బు, పర్సనల్ డేటాను కోల్పోతున్నారు. 

మీలో ఎవరికైనా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం వెంటనే అలర్ట్ గా ఉండండి. మాయగాళ్ల మాయలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సరైన సమయం ఇది. ప్రస్తుత మొబైల్ మార్కెట్లో పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లను ఇష్టపడేవారినే ఈ మోసగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి కంపెనీ పేరుతో వినియోగదారులను మోసగించేందుకు ప్లాన్ వేశారు. రియల్ మి కంపెనీ పార్టనర్ పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. ఆ సైటులో తాము రియల్ మి ఫ్రాంచైజీ పార్టనర్ షిప్ అంటూ కస్టమర్లను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ వెబ్ సైట్ లో భారీ టెక్స్ట్ తో పాటు BBK ELECTRONICE GROUP అని ఉంది. 

ఇక్కడ మీరు ఒకటి గమనించారా? సైబర్ మోసగాళ్లు కంపెనీ పేరులో ఎలక్ట్రానిక్స్ పేరు స్పెల్లింగ్ తప్పుగా వాడారు. వెబ్ సైట్.. ‘గెట్ రియల్ మి ఫ్రాంచైజ్ స్టోర్’ ను చూపిస్తుంది. నేవిగేషన్ మెనూలో డ్రాప్ డౌన్ మెనూ కూడా ఉంది. ఇందులో యూజర్ ఆప్షన్లు ఇచ్చారు. బికమ్ ఏ పార్టనర్, సొలుష్యన్ పార్టనర్, ఛానల్ పార్టనర్, సర్వీసు పార్టనర్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ విజిట్ చేసే కస్టమర్లు తమ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఫామ్ నింపాల్సిన అవసరం ఉండేలా రూపొందించారు. అది నమ్మి ఎవరైనా యూజర్లు తమ వ్యక్తిగత వివరాలను ఫామ్ లో ఎంటర్ చేస్తే మీ విలువైన డేటా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టే అవుతుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు.. రియల్ మి పేరుతో ఫేక్ వెబ్‌సైట్‌పై అసలు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఎవరో ఒకరు www.realmepartner.in పేరుతో ఒక ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసినట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ఫ్రాంచైజీ పార్టనర్ షిప్ అడిగినట్టుగా అందులో ఉన్నట్టుగా గుర్తించామని పేర్కొంది. దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం.. ఈ ఫేక్ వెబ్ సైట్‌ ఆపరేట్ చేసింది.. రియల్ మి సొంత కంపెనీది కాదు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎవరైనా బిజినెస్ చేస్తున్నట్టయితే దానికి మేం బాధ్యత వహించేది లేదు. 

ఈ ఫేక్ పోర్టల్ క్రియేట్ చేసిన యజమాని ఎవరో గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రియల్ మి కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం.. రియల్ మి కంపెనీకి అధికారిక వెబ్ సైట్ అనేది www.realme.com ఒకటి మాత్రమే ఉందని, ప్రొడక్టు ఇన్ఫర్మేషన్, బిజినెస్ పార్టనర్ షిప్ లకు సంబంధించి అన్ని వివరాలు మా అధికారిక వెబ్ సైట్లోనే అందుబాటులో ఉన్నాయని తెలిపింది.