తన ఇంట్లో రుద్రాభిషేకం నిర్వహించిన రోజా..

తన ఇంట్లో రుద్రాభిషేకం నిర్వహించిన రోజా..

 

కరోనా వైరస్ (కోవిడ్ 19) దేశంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్  ప్రజలను కూడా  భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం  వలన మరీ  ముఖ్యంగా కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాలలో విస్తరించింది. దాంతో దీని ప్రభావం మరింత విస్తరించకుండా జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించించింది. 

ఈ సమయం లో ప్రజలంతా ఇళ్ళకే పరిమితమై కరోనా వ్యాప్తిని అరికట్టాలని సీఎం జగన్ పిలుపును ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం చేసిన ఈ నిర్ణయాన్ని ప్రజలంతా పాటిస్తూ, ఇంట్లోనే వారివారి కార్యకలాపాల్ని జరుపుకుంటున్నారు. 

ఇదిలాఉంటే నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్  రోజా ఆంధ్రప్రదేశ్ లాక్ డౌన్ లో భాగంగా తన ఇంట్లో వారితో తన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రోజు లాక్ డౌన్ లో భాగంగా తన ఇంట్లో రోజా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. తన భర్త సెల్వమణితో కలసి వేదపండితుల సమక్షములో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ రుద్రాభిషేకం కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజికమాద్యమంలో చక్కర్లు కొడుతున్నాయి.

 ఈ రుద్రాభిషేకం తరువాత తన సామాజిక మాధ్యమం ద్వారా మాట్లాడిన రోజా, కరోనా వైరస్ యొక్క బాధ నుండి ప్రజలకు విముక్తి కల‌గాల‌ని రుద్రాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్,  కరోనా వ్యాప్తి  నివారణ కోసం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రజలందరూ పాటించి మన ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు.  లాక్ డౌన్ లో భాగంగా రోడ్డుపైన ఉన్న  ఓ నిండు గర్భిణిని ఇటీవలే తన కార్లో తీసుకెళ్లి కాపాడిన రోజా ప్రస్తుతం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం  కోసం రుద్రాభిషేకాలు చేస్తుండటంతో  రోజా పై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తుంది.