ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ప్ర‌యాణం మొద‌లు....

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్టీసీ ప్ర‌యాణం మొద‌లు....

 

ఆంధ్రప్రదేశ్‌లో ఎట్టకేలకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన బస్సులు... ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో డిపో నుంచి పరుగులు పెట్టాయి. విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ సర్వీసులు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. 

ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రయాణికులు బారులు తీరారు.

విశాఖజిల్లాలో బస్సు ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ మన్యం పాడేరులో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు .. ప్రయాణికులతో ఇతర ప్రాంతాలకు పాయణమైయింది. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో వలస కార్మికులు బస్సుల కోసం బారులు తీరారు. 

అదనపు చార్జీలు లేకుండా గతంలో ఉన్న చార్జీలతో ప్రయాణం కొనసాగుతోంది.70 సంవత్సరాలు దాటిన వారికి ప్రయాణం నిషేదించారు.ప్రతి బస్సులోనే సానిటైజెర్ ఉపయోగిస్తామని ఆర్టీసీ డిఎం తెలిపారు. కాంప్లెక్స్ లోని టికెట్ తీసుకొని ప్రయా ణికులకు బస్సు ఎక్కిస్తున్న ఆర్టీసీ సిబ్బంది శానిటేషన్ వినియో గించేలా తగిన చర్యలు చేపట్టారు. పాడేరు నుండి విశాఖపట్నం వరకు మధ్యలో మూడు స్టాపులు ఉంటాయని తెలిపారు. ప్రతి ప్రయాణికుడికి మాస్క్ తప్పనిసరి చేశారు.