
కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి దాని భారిన పడకుండా ఉండేందుకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, సానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు... ఇలా అన్నీ ఇన్నీ కావు. ప్రతిదీ కరోనా నుండి రక్షించుకోడానికే... అదంతా నిజమైనప్పటకీ అవన్నీ కొత్తగా మన జీవితాల్లోకి వచ్చినవే అయినప్పటకీ వాటిని బలవంతంగా అలవాటు చేసుకోలేక తప్పలేదు. ఇవి డాక్టర్లకు, నర్సులకు అయితే నిరంతరం అసలు తప్పట్లేదు...
అయితే ఈ మధ్య ఒక నర్సు పీపీఈ కిట్ల బాధ తట్టుకోలేకపోయింది. కానీ అది లేకుండా పేషెంట్లకి ట్రీట్మెంట్ చెయ్యడం కుదరదు కాబట్టి లోపల డ్రస్ తీసేసిందట.. కేవలం బికినీ మీద పీపీఈ కిట్ ధరించి వచ్చిందట. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని టులా అనే పట్టణంలో ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తోంది. అక్కడ కరోనా రోగులకు చికిత్స అందజేస్తున్నారు. అయితే, కరోనా వైద్యులకు సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్లను అందజేశారు. ఆమెకు కూడా ఇచ్చారు. అవి వేసుకుంటే ఉక్కపోతను భయంకరమైన ఉక్కపోత, వేడి పుడుతోందట. దీంతో ఆమె తన దుస్తులను తీసేసి, కేవలం బికినీలోనే పీపీఈ సూట్‌ను ధరించింది.
ఆ సూట్ ట్రాన్స్పరెంట్గా ఉండటంతో ఆమె బికినీ బయటకు కనిపిస్తోంది. ఆమె వస్త్రధారణపై ఆస్పత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఆ దేశ ఆరోగ్య శాఖ చెంతకు చేరడంతో ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. విచారణలో ఆ నర్సు పీపీఈ సూట్ ధరిస్తే వేడిగా ఉంటోందని, అందుకే తాను ఇలా బికినీ వేసుకున్నానని చెప్పింది. పీపీఈ సూట్ పారదర్శకంగా ఉండటం వల్లే బయటికి కనిపిస్తోందని వివరణ ఇచ్చింది. ఆమె జవాబుకు సంతృప్తి చెందని ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.