‘కబాలి’ డైరెక్టర్ తో కార్తికేయ..!!

0
224
Kartikeya

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా తర్వాత చాలా కథలు విన్నా. ఎలాంటి కథతో సినిమా చేయాలనే క్లారిటీ లేదు. టీఎన్‌ కృష్ణ చెప్పిన ‘హిప్పీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పా’’ అని కార్తికేయ అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా తర్వాత కార్తికేయ హీరోగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘హిప్పీ’. వీ క్రియేషన్స్‌పై రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిప్పీ’ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నారని తెలియడంతో మరింత ఉత్సాహం కలిగింది.

కబాలి’ లాంటి పెద్ద సినిమా తీసిన ఆయనతో నా రెండో సినిమా చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌ని టాప్‌ లెవెల్‌కు తీసుకెళుతుందని బలంగా నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రయిట్‌ చిత్రం ‘హిప్పీ’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి పెద్ద హిట్‌ తర్వాత కార్తికేయతో సినిమా చేయడం చాలెంజ్‌గా అనిపిస్తోంది’’ అన్నారు టీఎన్‌ కృష్ణ. ‘‘రెండు రోజులు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తాం. ఆ తర్వాత శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’’ అని కలైపులి థాను అన్నారు. జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఆర్‌డీ రాజశేఖర్, సంగీతం నివాస్‌ కె. ప్రసన్న.