సల్మాన్‌ ఖాన్‌ సోదరుడికి సమన్లు

0
213
salman khan brother సల్మాన్‌ ఖాన్‌ సోదరుడికి

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ కు థాణే పోలీసులు సమన్లు జారీ చేశారు. IPL బెట్టింగ్‌ కేసులో అయినకు సమన్లు పోలీసులు సమన్లు పంపారు. శనివారం(జూ-2) విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

టాప్‌ బుకీల ద్వారా అర్బాజ్‌ బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరికిన సోనూ జలాన్‌ అనే బుకీ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మంగళవారం(మే-29) సోనూను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అర్బాజ్‌ పేరును బయటపెట్టినట్లు సమాచారం.  సోనూకి దావూద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2012 IPL సమయంలో ఓ శ్రీలంక ప్లేయర్ కు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం రూ.10 కోట్లు ఇచ్చిన కేసులో సోనూ అరెస్ట్ అయ్యాడు.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”recent_posts” orderby=”random”]

గత నెల 16న థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దోంబివిలిలో బెట్టింగ్ జరుగుతున్న ప్రదేశంపై దాడి చేశారు. అప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేయగా..  ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోను జలన్ అనే బుకీ ఆధ్వర్యంలో ఏడాదికి 100 కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిపారు పోలీసులు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here