సందీప్ రెడ్డి వంగా ఆ క్రేజీ రీమేక్ చేస్తున్నాడా..!

సందీప్ రెడ్డి వంగా ఆ క్రేజీ రీమేక్ చేస్తున్నాడా..!

 

అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఒకే ఒక్క శుక్రవారంతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా.. ఆ సినిమా తర్వాత తెలుగులో ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ తనకు అచ్చొచ్చిన అర్జున్ రెడ్డి కథతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అని టైటిల్ పెట్టి అదే సినిమాని రీమేక్ చేశాడు. రివ్యూస్ నెగటివ్ గా వచ్చినప్పటికీ భారీ కలెక్షన్లతో కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వెల్లువెత్తాయి. 

అయితే సందీప్ నెక్ట్స్ మూవీ రణ్ బీర్ కపూర్ తో ఉంటుందని లేదా మళ్ళీ షాహిద్ కపూర్ తోనే ఉంటుందని చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ఏ మూవీ కన్ఫార్మ్ కాలేదు. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి మళ్ళీ టాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు నుంచి ఇప్పటికే ఒక సినిమా కమిట్ మెంట్ ఉంది. కానీ ఇమ్మీడియట్ గా మహేష్ బాబుతో సినిమా చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఒక కొత్త న్యూస్ బయటకు వచ్చింది. 

సందీప్ రెడ్డి వంగా ఈ సారి ఒక రీమేక్ ను డీల్ చేయబోతున్నాడని, నిర్మాతలు సందీప్ తో చర్చలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోసాయుమ్ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ పొందిన సంగతి తెలిసిందే.. ఇందులో నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి హీరోలుగా దాదాపు కన్ఫర్మ్ అయ్యారు. దర్శకుడు విషయానికి వచ్చేసరికే ఈ సినిమా ఎవరు చేస్తే బావుంటుంది అనే విషయం దగ్గర ఆగింది. 

దాంతో నిర్మాత నాగ వంశీ సందీప్ రెడ్డి వంగాని అప్రోచ్ అయ్యి, ఈ సినిమా రీమేక్ చేయమని ఒప్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో ఆ సంస్థ సొంత దర్శకుడు త్రివిక్రమ్ కూడా సందీప్ తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ అవ్వడం తో, అలాగే స్టార్ హీరోలు రెడీగా ఉండడంతో, ఈ అయ్యప్పనుమ్ కోసాయుమ్ సినిమా రీమేక్ సందీప్ చెయ్యొచ్చు అని గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమా సందీప్ చేస్తే మార్కెట్ పరంగా కూడా క్రేజ్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.