శరభ మూవీ రివ్యూ

0
116
sarabha movie review

టైటిల్ : శరభ
జానర్ : సోషియో ఫాంటసీ
తారాగణం : ఆకాష్‌ కుమార్‌, మిస్తీ చక్రవర్తి, జయప్రధ, నెపోలియన్‌, పొన్‌వన్నన్‌
సంగీతం : కోటి
దర్శకత్వం : ఎన్‌. నరసింహారావు
నిర్మాత : అశ్వనీ కుమార్‌ సహదేవ్‌

రేటింగ్ : 2.5/5

ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన శరభ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జయప్రధ లాంటి సీనియర్‌ నటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం కూడా శరభకు కలిసొచ్చింది. మరి ఆ అంచనాలను శరభ అందుకుందా..? ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్‌ కుమార్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? జయప్రధ రీ ఎంట్రీలో సత్తా చాటారా..?

ప్లస్‌ పాయింట్స్‌ ;
జయప్రధ
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
హీరో

మైనస్‌ పాయింట్స్‌ ;
కథనం
ఫస్ట్‌ హాఫ్‌
సంగీతం

Sarabha Movie Heroine Mishti
Sarabha Movie Heroine Mishti

చాలా కాలం తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ సోషియో ఫాంటసీ కథను తీసుకువచ్చిన దర్శకుడు ఎన్‌ నరసింహారావు మెప్పించలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ పాయింట్‌తో ప్రారంభించినా.. తొలి భాగం అంతా టైంపాస్‌ సన్నివేశాలతో లాగించేశారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌కొట్టిస్తాయి. ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మేకప్‌, గ్రాఫిక్స్‌ కీలకం. కానీ ఆ రెండు విషయాల్లో శరభ నిరాశపరుస్తుంది. క్లైమాక్స్‌లో నరసింహా స్వామి స్వయంగా వచ్చి రాక్షసున్ని అంతం చేసే సీన్‌ బాగుంది. సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.