నిబంధనలు పాటిస్తాం.. మల్టీ ప్లెక్స్ లకు అనుమతులు ఇవ్వండి...

నిబంధనలు పాటిస్తాం.. మల్టీ ప్లెక్స్ లకు అనుమతులు ఇవ్వండి...

 

ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ 4.0 నడుస్తోంది. అయితే కొన్ని సడలింపులు ఇవ్వడంతో బస్సులు రోడ్డెక్కాయి. రైళ్ళు కూడా పట్టాలు ఎక్కబోతున్నాయి. దీంతో మల్టీ ప్లెక్స్ లకు కూడా అనుమతులు ఇవ్వాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా కోరింది. 

ఇందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీస్ కి యాజమాన్యాలు ఒక విన్నపం చేశారు. థియేటర్స్ ఓపెన్ చేయడానికి అనుమతిస్తే నిబంధనలు పాటిస్తూ తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో మొత్తం ఒక లిస్ట్ రెడీ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని అన్నారు. 

మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ అలాగే మూసి ఉంచడం వల్ల మెయింటినెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిపారు. అలాగే కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. అందుకే తగిన జాగ్రత్తలతో మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి అనుమతులు ఇవ్వాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. ఈ విషయం కేంద్రం పరిధిలో ఉండటం వల్ల దీనిపై కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.