అగ్రస్థానం కోల్పోయిన షెఫాలీ వర్మ

అగ్రస్థానం కోల్పోయిన షెఫాలీ వర్మ

 

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర  పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత ఆటగాళ్ళు టార్గెట్ ను ఛేదించలేక ఓటమిపాలయ్యారు. ఫైనల్స్ లో భారత్ పై గెలుపుతో ఆస్ట్రేలియా ఐదో సారి ప్రపంచకప్ టైటిల్ ను సొంతం చేసుకుంది.  అయితే భారత ప్లేయర్లు మాత్రం ఇటీవల విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ ర్యాంకులను కోల్పోయారు. 

టోర్నీ మొత్తంలో అద్భుత ప్రతిభ కనబరిచి ఇండియాను ఫైనల్ కు చేర్చిన యువ బ్యాట్స్ మెన్ షెఫాలీ వర్మ మూడో స్థానానికి పడిపోయింది. ఇంతకు ముందు వరకూ షెఫాలీ 744 పాయింట్లతో  అగ్రస్థానంలో కొనసాగింది. అయితే ప్రపంచకప్ ఫైనల్ లో  ఆమె కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో తన ర్యాంక్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ లో అజేయంగా 78 పరుగులు చేసిన ఆసిస్ ఓపెనర్  బెత్ మూనీ రెండు స్థానాలు ఎగబాకి 762 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. మూనీ ఆరు ఇన్నింగ్స్‌లలో 64 సగటుతో 259 పరుగులు చేశారు. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' కూడా తనకే దక్కింది. ఆమె తన కెరీర్‌లో తొలిసారిగా అగ్రస్థానాన్ని చేరుకోవడం విశేషం.ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 750 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది.  ఇందులో భారత్ కు  చెందిన స్మృతి మంధనా, జెమిమా రోడ్రిగెజ్ కూడా ఉన్నారు. భారత వైస్ కెప్టెన్ మంధనా ఒక స్థానం నుండి ఏడవ స్థానానికి పడిపోగా, రోడ్రిగెజ్ తొమ్మిదవ స్థానంలోనే ఉన్నారు. అలిస్సా హీలీ రెండు స్థానాలు దూకి ఐదవ స్థానానికి చేరుకుంది.

బ్యాట్స్‌మెన్‌ల లిస్ట్‌లో దీప్తి శర్మ 43 వ స్థానంలో నిలిచింది.  తొలిసారిగా మొదటి ఐదు ఆల్‌రౌండర్లలో చోటు దక్కించుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఆరో, ఏడవ, ఎనిమిదో స్థానంలో ఉన్నారు, ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి, రాధా యాదవ్, పూనమ్ యాదవ్ వరుసగా ఆరో, ఏడవ, ఎనిమిదో స్థానంలో ఉన్నారు, ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో ఉన్నారు.