మీరే కరోనా వైరస్ ని అంటించారు: అక్తర్

మీరే కరోనా వైరస్ ని అంటించారు: అక్తర్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇప్పుడు చైనాపై ఘాటు విమర్శలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెలో మాట్లాడుతూ చైనీయులు ఆహారపు అలవాట్లను దుయ్యబట్టాడు. మీరు అసలు గబ్బిలాలలను ఎందుకు తింటున్నారు అని ప్రశ్నించాడు. మీరు వాటి రక్తాన్ని, మూత్రాన్ని తాగడం వల్లే ప్రపంచానికి వైరస్ వ్యాప్తి చెందుతోందని మండిపడ్డాడు. తాను చైనా గురించే మాట్లాడుతున్నానని కూడా స్పష్టం చేశాడు. చైనీయులు ప్రపంచం మొత్తాన్ని స్థంభించే విధంగా చేశారని మండిపడ్డారు. అసలు చైనా వాళ్ళు కుక్కల్ని, పిల్లుల్ని ఎందుకు తింటారో నాకు అర్థం కావడం లేదని, ఇలా చేయడం వల్ల తనక చాలా కోపంగా ఉందన్నాడు. 

తనకు చైనా పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదని అయితే వారు మూగ జంతువుల పట్ల మరీ క్రూరంగా వ్యవహరించడం తనకు నచ్చడం లేదన్నారు. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలను తినడం వారి సంస్కృతిలో భాగం అని వారు అనొచ్చు. కానీ వారి ఆహారపు అలవాట్లు ఇప్పుడు వారికి నష్టాన్ని మిగిల్చిందని అన్నాడు. ప్రాణాంతకమైన వైరస్ భారత్ చేరొద్దని తాను కోరుకుంటున్నానని షోయబ్ తెలిపాడు. భారత్ లో తన మిత్రులతో టచ్ లో ఉన్నానని వారంతా బానే ఉన్నారని తెలిపారు. కోవిడ్ దెబ్బతో పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ సందిగ్దంలో పడిందని, పీఎస్ఎల్ షెడ్యూల్ కుదించారని షోయబ్ అన్నాడు. సెమీఫైనల్,ఫైనల్ మ్యాచ్ లు సైతం ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు సిద్దమయ్యారని గుర్తుచేశాడు.