ఐపీఎల్ అభిమానులకు షాక్..

ఐపీఎల్ అభిమానులకు షాక్..

భారత క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే.. ఇండియాతో పాటు చాలా దేశాల్లో ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎన్ని పనులున్నా వాటన్నింటినీ పక్కన బెట్టి ఫ్యాన్స్ ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ సారి ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ ప్రమాదకరమైన వైరస్ ప్రభావం ఇప్పుడు ఐపీఎల్ పై పడింది.

ఐపీఎల్ నిర్వహణ వల్ల కరోనా వైరస్ అధికంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, వెంటనే దీనిని నిలిపివేయాలని చాలా మంది వాదిస్తున్నారు. ఐపీఎల్ వద్దంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టు న్యాయవాది జి అలెక్స్ బెంజిగర్ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణకు అనుమతి నిరాకరించాలని బీసీసీఐని ఆదేశించాలంటూ ఆయన ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే చాలా మంది క్రికెట్ ప్లేయర్లు కూడా ఈ విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ తో సిరీస్ ఆడేందుకు వచ్చిన సౌత్ ఆఫ్రికా టీం తమ వెంట ప్రత్యేకమైన వైద్యులను కూడా తెచ్చుకుంది. అయితే అంత భయపడాల్సిన అవసరం లేదంటూ మరికొందరు దీనిని కొట్టిపడేస్తున్నారు..

ఈ విషయంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఏమని తీర్పునిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా ఐపీఎల్ అభిమానులకు మాత్రం ఈ విషయం కొంత భయాందోళనలోనే ఉన్నారు.