నాని కి జోడి గా ‘జెర్సీ’లో ‘యూటర్న్‌’ భామ..!

0
253
Nani new movie jersey

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం జెర్సీ. ఇటీవల దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం హాలీడేస్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. షార్ట్‌ గ్యాప్‌ తరువాత జెర్సీ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడు. ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో పీరియాడిక్‌ డ్రామా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి రెబ్బా మోనికా జాన్‌ మరో హీరోయిన్‌గా నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ‍బ్యానర్‌ పై తెరకెక్కుతున్నన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.