బిర్యానీ మత్తులో 50,000 కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

 బిర్యానీ మత్తులో 50,000 కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఫుడ్ డెలివరీ యాప్‌ నుంచి 200 రూపాయిల చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి 50,000 రూపాయిలు కోల్పోయాడు. చివరికి సాంబార్ రైస్ ప్యాకెట్ తో సర్దుకున్నాడు. అలా ఎలా మోస‌పోయాడు ఇప్పుడు చూద్ధాం.

రహ్మత్ నగర్ లోని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఫుడ్ డెలివరీ యాప్‌ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన తరువాత అతనికి వేరే ఆర్డర్ రావడంతో ఇంటర్నెట్ లో కస్టమర్ కేర్ నంబర్ అనుకొని దొంగల ముఠా నంబర్ కి కాల్ చేసి ఇరుక్కుపోయాడు. ఇదే మంచి అవకాశం అనుకున్న దొంగ డబ్బులు దొంగలించాడు. ఇదంతా రెండు రోజుల ముందు జ‌రిగింది.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫుడ్ డెలివరీ యాప్‌ జోమాటొ నుంచి ఒక చికెన్ బిర్యాని ఆర్డర్ చేయగా అతనికి చికెన్ బిర్యాని కాకుండా సాంబార్ రైస్ ప్యాకెట్ అందింది. దాంతో అతను కోపం లో ఇంటర్నెట్ లో ZOMATO కస్టమర్ కేర్ నంబర్ అని వెతకగా అతనికి ఒక నంబర్ దొరకగానే ముందువెన‌క‌ చూసుకోకుండా దానికి కాల్ చేసి అతని కోపం అంతా చూపించేసాడు.

ఇదంతా విన్న దొంగ ఇదే మంచి అవకాశం అనుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కోపం చల్లార్చాడు. అతనికి అతని డబ్బులు వెన్నక్కి పంపిస్తాం అని భరోసా ఇచ్చాడు. ఆ తరవాత దుండగులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పేటీఎం డిటైల్స్ తీసుకొని.. రిఫండ్ ప్రొసెస్  అంటూ స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ ఫాల్లో అవ్వమని అడిగాడు దాంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దొంగను నమ్మి డబ్బులు తిరిగి వస్తాయి అనుకొని చెప్పింద‌ల్లా చేసాడు.

 ఆ తరువాత ఎర్రర్ వస్తుందని దొంగ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కి చెప్పాడు.. అదేవిధంగా మూడు సార్లు ప్రొసెస్ చెయ్య‌గా అప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కి అర్థం అయ్యింది అతని బ్యాంక్ అకౌంట్ లో నుంచి 50,000 నగదు పోయింది అని. ఇది గుర్తించిన అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కంప్లయింట్ న‌మోదు చేసుకొని పబ్లిక్ ని ఇలాంటి దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అతను ఆ యాప్‌ లోనే కంప్లైట్‌ చేయాల్సింది అని అతనికి చెప్పారు.. కేస్ దర్యాప్తు ప్రారంభించారు.