రేపు సోనియా, రాహుల్ ఎన్నికల ప్రచారం

0
53
sonia gandhi and rahul gandhi election campaign

కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు మేడ్చల్‌లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 5.30గంటలకు మేడ్చల్ సభాస్థలికి చేరుకుంటారు. కాగా… సభ వద్ద రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల కోసం ఒకటి, అభ్యర్ధుల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాహుల్ ప్రసంగం మొత్తం 10లక్షల మందికి చేరేలా ఏర్పాట్లు చేస్తుండగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎల్ఈడీలను ఏర్పాటుచేసి కనీస 5వేల మందికి తగ్గకుండా ఎల్ఈడీల వద్ద కూర్చోబెట్టాలని టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది.