చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే..

చంద్రబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే..

 

శ్రీకాళహస్తి  వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు  మధుసూదన రెడ్డి ఎంతటి చమత్కారో మనందరికీ తెలిసిందే. ఏపీ అసెంబ్లీ లో తనదైన పంచ్ లతో టీడీపీ అధినేత చంద్రబాబును ఆట ఆడుకునే ఈ ఎమ్మెల్యే , కరోనా వైరస్ ప్రభావం తో  రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందిపడుతుంటే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్న చంద్రబాబును తనదైన స్టైల్ లో విమర్శించారు. 

వివరాల్లోకి వెళ్తే కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం ఆంధ్ర‌ప్రదేశ్ కు కూడా  చేరిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ వలన  ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుండగా ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ లో ప్రబలకుండా  జగన్ సర్కార్ ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.

 అయితే ఈ విషయం పై చంద్రబాబు స్పందిచాడు. ప్రస్తుత ప్రభుత్వం కరోనా వైరస్ అరికట్ట లేక పోతుందని రాజకీయ విమర్శలు చేసాడు. ఈ విషయం పై స్పందించిన మధుసూదన్ రెడ్డి చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ప్రపంచం మొత్తం కరోనా ప్రభావం తో తీవ్ర సంక్షోభంలో ఉంటే చంద్రబాబు మాత్రం ఇదంతా అధికార పార్టీ వైఫల్యం అనడం విడ్డురంగా ఉందన్నారు.

 మా ప్రభుత్వం ఇప్పటికే జర్మనీ నుంచి ఆయుర్వేదిక్ మందులను తీసుకొస్తుంది కానీ చంద్రబాబు తన నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదని విమర్శించారు. ఈ చవక బారు రాజకీయాల వలన 70 ఏళ్ళు నిండిన చంద్రబాబు కు కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. దాంతో తమకు ప్రతిపక్ష నాయకుడు లేడనే బాధ మిగులుతుంది కాబట్టి మొదట తన ఆరోగ్యాన్ని చూసుకోవాలని చంద్రబాబుకు, మధుసూదన్ రెడ్డి చురకలు అంటించారు.