రేపటి నుండి సినిమా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చట

రేపటి నుండి సినిమా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చట

 

లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంటూ షూటింగ్స్ జరుపుకోవచ్చని అనుమతులు ఇచ్చారు. ఏపీ సర్కార్ తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి ముందుకు రావడంతో తెలంగాణ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో రాజమౌళి, అల్లు అరవింద్, సీ.కల్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, త్రివిక్రమ్ లాంటి సినీ పెద్దల సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి నివాసంలో మీటింగ్ జరిగింది.

ఈ చర్చలో పాల్గొన్న సినీ ప్రముఖులు విన్నపంపై ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించింది. షూటింగ్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు పెట్టుకోవాలి, రిలీజ్ లు ఎప్పుడు చేసుకోవాలి అనే అంశంపై చర్చ జరిగింది. రేపట్నుంచి అంటే ఈ నెల 22 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకోవచ్చని తెలుస్తోంది. 

ఎవరెవరి సినిమాలు సగంలో ఆగిపోయాయి, ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పనులు మొదలు పెడితే ఎలా చేస్తారనేది ఒక మాక్ వీడియో తీసి ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. దీనిపై సీఎంతో చర్చించి మరో రెండు రోజుల్లో మరోసారి సమావేశమై చర్చిస్తారట. తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అండగానే ఉందని, సీఎం కేసీఆర్ కి కూడా సినిమా పరిశ్రమ అంటే ఎంతో అభిమానం కాబట్టి సానుకూలంగా స్పందిస్తారని మంత్రి తలసాని తమతో చెప్పినట్లు నిర్మాత సీ.కల్యాణ్ తెలిపారు.