బన్నీ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్...

బన్నీ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్...

 

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో సుకుమార్ ఒకరు. ఈ లెక్కల మాస్టారు తెరకెక్కించే సినిమాలు ఓ పద్ధతి ప్రకారం ఉంటాయి. సుకుమార్ రీసెంట్ గా తీసిన రంగస్థలం సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దీంతో సుకుమార్ తెరకెక్కించే తరవాత సినిమా గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్ తన తరువాత సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందని తెలియడంతో ఈ సినిమా కథ పై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా లవ్ స్టోరీ అని కొందరు,  కాదు మాస్ కథాంశం గా తెరకెక్కబోతోందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

సుకుమార్ తెరకెక్కించిన గత సినిమాలు 'వన్ నేనొక్కడినే' , 'నాన్నకు ప్రేమతో' మాదిరిగానే బన్నీతో చేసే సినిమాను సైతం రివేంజ్ ఫార్ములాతోనే తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అయితే ఈసారి సుకుమార్ ఎంచుకున్నది పూర్తి స్థాయి రివేంజ్ ఫార్ములా కాదట. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా కలిసిన కథాంశంగా ఈ సినిమా నడుస్తుందని సమాచారం.

సుకుమార్ కి తన సినిమాల్లో కథానాయకులను డిఫరెంట్ లుక్ తో చూపించడం అలవాటు.  అలాగే ఈ సినిమాలోనూ బన్నీని ఆయన మాస్ లుక్ తో చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా లక్కీగర్ల్  రష్మికను ఎంపిక చేసినట్లు సమాచారం.