సూపర్ స్టార్ 50 లక్షలు విరాళం !

సూపర్ స్టార్ 50 లక్షలు విరాళం !

 

కరోనా నివారణ కోసం మనదేశం మొత్తం లాక్ డౌన్ చేసుకున్నాం. మిగతా రంగాల లాగానే సినిమా రంగం కూడా షూటింగ్స్ లేక, రోజువారీ లైట్ మెన్ లాంటి కార్మికులు, జూనియర్ ఆర్టిస్ట్స్ లాంటి కళాకారులు, మిగతావారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 వాళ్ళని ఆదుకోవ‌డానికి మన తెలుగు సినిమా పరిశ్రమలో ఐతే రాజశేఖ‌ర్ పది రోజులకి సరిపడా బియ్యం పప్పు, చింతపండు లాంటి నిత్యావసర వస్తువులు మా పేద కళాకారులకు అందిస్తే, మరో యువ హీరో నితిన్ సీఎం సహాయ నిధికి ఆంధ్రకు పది లక్షలు, తెలంగాణ కు పది లక్షలు చెక్ అందించారు. తెలుగు పరిశ్రమ నుండి మిగతా వారు స్పందించాల్సి ఉంది.

ఐతే తమిళనాడు లో పరిస్థితి మరోలా ఉంది. నటుడు సూర్య ముందుగా పది లక్షలు ఆర్థిక సహాయం ప్రకటిస్తే, ఇవాళ సూపర్ స్టార్ రజనీకాంత్ 50 లక్షలు ఎనౌన్స్ చేశారు. మరోనటుడు విజయ్ సేతుపతి పది లక్షలు ప్రకటించారు. మరో బహు బాషా నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే తనవద్ద పనిచేసే వారికి మే నెలవరకు జీతాలు చెల్లించానని చెప్పారు.