గూగుల్ నా కాపురంలో చిచ్చుపెట్టింది...

గూగుల్ నా కాపురంలో చిచ్చుపెట్టింది...

 

ఓ భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గూగుల్ గొడ‌వ‌లు పెట్టింద‌ట‌.. వారు కొట్టుకోని విడిపోయే దాకా తెచ్చింద‌ట‌.. అదేంటి అని ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారా.. ఈ వింతైన సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. ఓ భార్య కి భ‌ర్త మీద లేనిపోని డౌట్లు పుట్టిస్తుంద‌ట‌. అత‌ను ఎక్క‌డెక్క‌డో తిరిగిన‌ట్లు త‌ప్పుడు డాటా చూపిస్తుంద‌ట‌.. గూగుల్ ఇదంతా చేస్తుందా అంటే అవును ఖ‌చ్చితంగా అంటున్నాడు ఆ భ‌ర్త‌... అందుకే పోలీస్ స్టేష‌న్‌లో కేసు కూడా పెట్టాడ‌ట‌...

తమిళనాడులోని మైలాదుతురాయ్‌కి చెందిన ఆర్. చంద్రశేఖర‌న్ అనే వ్యక్తి ఇటీవల గూగుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  ప్రతి రోజు తాను ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక భార్య తన ఫోన్ చెక్ చేసి తాను ఆ రోజు ఎక్కడెక్కడికెళ్లిందీ తెలుసుకుంటుందని అతడు పోలీసులకు చెప్పాడట. అయితే మే 20న మాత్రం తాను వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లినట్టు గూగుల్ మ్యాప్స్‌లో రికార్డైందని చంద్రశేఖరన్ పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడని సమాచారం. 

దీని వల్ల తన కాపురంలో కలతలు రేగాలయని ఆగ్రహం వ్యక్తం చేసిన అతడు గూగుల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడట. అయితే పోలీసులు అత‌ని కంప్లైట్ ను రిజిస్ట‌ర్ చెయ్య‌లేదంట‌. కానీ అందులో నిజ‌మెంత అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది...