కేటీఆర్‌కు ప్రకాశ్‌రెడ్డి సవాల్‌..!!

Prakash Reddy Revuri

హరీశ్‌ రావును కేసీఆర్‌ వారసుడిగా ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ము కేటీఆర్‌కు ఉందా? అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి సవాల్‌ చేశారు. హన్మకొండ భవానీనగర్‌లోని టీడీపీ ఉమ్మడి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవేళ కేటీఆర్‌ ప్రకటిస్తే ఇంతకు ముందు తాను హరీశ్‌ రావు విషయంలో చేసిన వ్యాఖ్యలను బేషరతుగా విరమించుకుంటానని ప్రకటించారు. చంద్రబాబునాయుడును వెన్నుపోటు దారుడు అనడాన్ని ఖండించారు. ఇది కేటీఆర్‌ దిగజారుడు తనానికి నిదర్శనంగా పేర్కొన్నారు. కేటీఆర్‌ను పిల్లకాకిగా అభివర్ణించారు. చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.Prakash Reddy Revuri2

1995లో డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి వరంగల్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మె దక్‌ జిల్లాల్లో కేసీఆర్‌, నగేశ్‌, కడియం శ్రీహరి, దయాకర్‌రావు, మాధవరెడ్డి అన్నగారి ఆదేశాలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు.  ఎన్‌టీఆర్‌ తమను సస్పెండ్‌ చేయకుండా చూడాలని చంద్రబాబును వైస్రాయి హోటల్‌కు తీసుకువెళ్లారని, బాబు తన వంతు ప్రయత్నం చేస్తుండగానే ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించింది కేసీఆరేనని వివరించారు.1995 ఆగస్టులో ఈ సం ఘటన జరిగితే 2001వరకు కేసీఆర్‌ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. 1200మంది అమాయకుల బలిదానంవల్ల వచ్చిన తెలంగాణాను కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురే అనుభవిస్తున్నారన్నారు. నాలుగు కోట్ల ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఈ నలుగురేనన్నారు. ఇప్పుడు హరీశ్‌ రావుకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. కేటీఆర్‌, కవిత అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు అండగా ఉన్న హరీశ్‌ రావును పార్టీనుంచి దూరం చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. కేటీఆర్‌కు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? నీటి పారుపాదల శాఖను ఆయన సమీక్షిస్తారా? అని నిలదీస్తారు. చంద్రబాబునాయుడును కార్నర్‌ చేసి లబ్దిపొందాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావు తనను ఏకపక్షంగా సంబోధించడాన్ని తప్పుబట్టారు. హరీశ్‌రావు వయసు తన రాజకీయ అనుభవం అంత లేదన్నారు. హరీశ్‌ రావు అధికార అహం తలకెక్కి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే వారిని రాజకీయంగా సమాధి చేస్తారన్నారు.