తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్‌ అప్‌డేట్స్‌

0
167
Telangana-Elections-Results-2018-Live-Updates

[table id=3 /]

సిద్దిపేట తెరాస అభ్యర్థి, తాజా మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిద్ధిపేటలో ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరీశ్‌రావు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకున్న హరీశ్‌రావు ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు.

అంబర్‌పేట్‌ శాసనసభా నియోజకవర్గ భాజపా అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ ఆయన ఆధిక్యంలో ఉన్నారు.

తెలంగాణలో దూసుకుపోతున్న కారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ దూసుకుపోతుంది. ప్రస్తుతం తెరాస 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రజా కూటమి 14, భాజపా, 5, మజ్లిస్‌ 3, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

కేటీఆర్‌ ఫొటోపై కోన వెంకట్‌ కామెంట్ చేసాడు – ‘ఈ ఒక్క ఫొటో చాలు బ్రదర్‌..ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. శుభాకాంక్షలు’ అని వెంకట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉదయం 10.30గంటల సమయానికి తన సమీప ప్రత్యర్థి నాయిని నరోత్తమ్‌రెడ్డిపై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉదయం 11గంటలకు అధికార తెరాస పార్టీ ఒక స్థానం(జగిత్యాల)లో విజయం సాధించి, 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ప్రజా కూటమి 18 స్థానాల్లో భాజపా 2, ఎంఐఎం 5, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కొడంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఇంకా వెనుకంజలోనే కొనసాగుతున్నారు. రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి స్వల్పంగా 626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి దిశగా సాగుతున్నారు. 14వ రౌండ్ ముగిసేసరికి తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి 38,022 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పూర్తి వివరాలు వచ్చేందుకు ఇంకా నాలుగు రౌండ్లు మాత్రమే ఉన్నాయి.

తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 92 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.

సిద్దిపేట లో రికార్డు సృష్టించిన హరీశ్‌రావు, తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు రికార్డు సృష్టించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలుపు పొందారు. 2004లో చార్మినార్‌ ఎంఐఎం అభ్యర్థికి లక్షా 7 వేల మెజార్టీ వచ్చింది. ఇప్పటివరకూ ఇదే అత్యధికం.

అతి తక్కువ ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కేవలం 197 ఓట్లమెజార్టీతో గెలుపొందారు

పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇక్కడ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి 1980 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.