జనవరి 10న తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ?

0
197
telangana-panchayat-elections

నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల సందడి..ముగిసిందో లేదో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కోర్టు సూచించింది. కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం రిజర్వేషన్లను పూర్తి చేసి ఎన్నికలు  నిర్వహించనున్నారు. తాజాగా బీసీ ఓటర్ల గణనను చేయాలని ఆదేశాలు అందడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ కసరత్తులో నిమగ్నమైంది. ఆదివారం బీసీ ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 584గ్రామ పంచాయతీల్లో ఈ పోరు మొదలవనుంది. 21మండలాల పరిధిలో 584 గ్రామ పంచాయతీలు ఉండటంతో వాటిల్లో బీసీ ఓటర్ల గణనపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

జనవరి 10న మళ్ళీ ఎన్నికలు

అయితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చింది. మూడునెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టంచేస్తూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసి, పాలకవర్గాలకు బాధ్యతలను అప్పగించాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలైన అధికారయంత్రాంగం అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఈ నెల 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది.

15న తొలి జాబితా 

బీసీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 13, 14వ తేదీల్లో గ్రామసభ అనంతరం 15వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నారు. దీని ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి.