తెలంగాణ‌లో మ‌రో పోలీసు ఆఫీస‌ర్ కు క‌రోనా..

 తెలంగాణ‌లో మ‌రో పోలీసు ఆఫీస‌ర్ కు క‌రోనా..

 

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కోసం పోలీసులు నిరంత‌రం శ్ర‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  వారి కుటుంబ స‌భ్యుల‌ను విడిచిపెట్టి నిరంత‌రం రోడ్ల‌పై గ‌స్తీ కా‌స్తూ ప్ర‌జ‌ల‌ను  విచ్చ‌ల‌విడిగా తిర‌గాకుండా చూస్తున్నారు. ఇలాంటి పోలీసులు ఇప్పుడు క‌రోనా బారిన ప‌డుతుండ‌టం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. అందులో భాగంగా  నిన్న హైద‌రాబాద్ కు చెందిన కానిస్టేబుల్ క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన విష‌యం మ‌ర‌వ‌క ముందే ఇవాళ పోలీస్ శాఖ‌లో మ‌రో క‌రోనా కేసు న‌మోదైంది. 

వివ‌రాల్లోకి వెళ్తే బాలాపూర్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ఆరోగ్యం గ‌త కొద్దిరోజులుగా బాగా లేకపోవడంతో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో అతనికి పరీక్షలు చేశారు. అయితే ఈ రోజు వ‌చ్చిన నివేదికలో అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.

దీంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అలాగే అత‌డు ప‌నిచేస్తున్న  బాలాపూర్ పోలీసు స్టేషన్  సిబ్బందిని కూడా  హోమ్ క్వారంటైన్‌కు తరలించారు. స‌ద‌రు డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్  హబ్సీగూడలోని రోడ్డు నెంబరు 8లో నివాసం ఉంటున్నాడు. దీంతో అత‌ని కుటుంబ సభ్యులను సైతం హోం క్వారంటైన్ చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. 

ఇదిలా ఉంటే క‌రోనా సోకిన ఇన్స్ పెక్ట‌ర్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇక్కడే చిక్కుకుని పోయిన వలసకూలీల తరలింపు ప్రక్రియ కోసం ప‌నిచేస్తున్నారు. ఏది ఏమైనా  పోలీసుల‌కు సంభ‌విస్తున్న వ‌రుస క‌రోనా కేసులు  పోలీస్ శాఖను తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.