ఓటు వేసిన రాజకీయ నాయకులు

0
240
ministers-casts-vote

తెలంగాణ పోలింగ్ 2018 :

తెలంగాణలోని 119 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11గంటల నుంచి 12గంటల మధ్యలో ఓటు వేస్తారని తెలిపారు.

సిద్దిపేట జిల్లా

*  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
*  మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలోని 102వ పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు వేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Harish-Rao-casts-vote

* కోడంగల్ లో రేవంత్ రెడ్డి తన ఓటు వేసారు

*  ప్రజాకూటమి ఛైర్మన్‌ కోదండరామ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తార్నాకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
*  ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్‌

KTR-cast-vote

*  జూబ్లీహిల్స్ యూరో కిడ్స్ స్కూల్‌లో ప్రజాకూటమి స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
*  కరీంనగర్‌లోని కాశ్మీర్ గడ్డ యునైటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
*  మహేశ్వరం అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు వేశారు.
* కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
*  కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశ్వేశ్వర్‌రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Jagadish-Reddy-Casts-Vote
* మెదక్‌ జిల్లా రామాయంపేట మండలంలోని కొనాయిపల్లిలో ఉప సభాపతి పద్మా దేవేందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రోశయ్య హైదరాబాద్‌ అమీర్‌పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

* కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని నాంపల్లి హుమయూన్‌ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

* రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తన సతీమణితో వచ్చి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సెయింట్ అగస్టీన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.