తెలుగు కెమెరామెన్ కు కరోనా...

తెలుగు కెమెరామెన్ కు కరోనా...

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ దెబ్బతీస్తోంది. దేశ ప్రధానుల భార్యలను సైతం ఈ వైరస్ వదలడం లేదు. ఎంతో మంది సెలబ్రిటీలను కూడా ఈ వైరస్ పట్టుకుంది. 

ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఈ వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం సీరియస్ గానే ఉండేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కరోనా  మహమ్మారి టాలీవుడ్ ని తాకింది.

 ప్రముఖ కెమెరామెన్, తెలుగు టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కునపరెడ్డి శ్రీనివాస్ కి కరోనా లక్షణాలు బయట పడడంతో చికిత్స కోసం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో ఇతనికి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై  శ్రీనివాస్ స్నేహితులను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. 

ఈ కరోనాని దయచేసి తేలిగ్గా తీసుకోవద్దని, ప్రజలెవ్వరూ బయటకి రావొద్దని దీనిపై ఒక వీడియో తీసి కూడా పంపించారు. శ్రీనివాస్ రెడ్డికి సోకిన కరోనా వైరస్ ప్రభావం ఇంకా టాలీవుడ్ పై ఎవరిపైన పంజా విసిరే అవకాశం ఉందేమో అని అందరూ భయపడుతున్నారు.