లోన్లు తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు

లోన్లు తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు

 

బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ శుభవార్త అందించింది. మారటోరియం ను మరో 3 నెలలు పాటు పొడిగించింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.  దీంతో టర్మ్ లోన్ తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. 

దీంతో రుణం తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో 2021 లోనూ వృద్ది రేటు తిరోగమనంలో ఉంటుందని చెప్పారు. ఇక దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్న ఆయన ఆహార భద్రతకు పూర్తి భరోసా ఉందని పేర్కొన్నారు. 

రిజర్వు బ్యాంక్ 40 బేసిక్ పాయింట్ల మేర కోత విధించింది. ఇంతకు ముందు మార్చి 27 న రెపో రేటును ఏకంగా 75 బేసిస్ పాయింట్ మేర కోత విధించిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ లాక్ డౌన్ ఎఫెక్టే కారణమని తెలుస్తోంది. 

హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి పలు రకాలు టర్మ్ లోన్లు తీసుకున్న వారిలో చాలా మంది ఈ ఆప్షన్ వినియోగించుకున్నారు. క్రెడిట్ కార్డు బకాయిలకు కూడా మారటోరియం వర్తిస్తుంది.