థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ట్విట్టర్ రివ్యూ

0
118
thugs of hindustan review


అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లు నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ మూవీ భారీ అంచనాల నడుము నేడు (నవంబర్ 8) విడుదలైంది. 1839 కాలం నాటి `కన్ఫెషన్స్ ఆఫ్ థగ్‌` నవల ఆధారంగా `ధూమ్‌-3` ఫేమ్‌ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమీర్, అమితాబ్‌లతోపాటు కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌, రోనిత్ రాయ్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. సుమారు మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బందిపోటు దొంగగా నటించడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ హంగులతో నేడు విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.