తప్పుడు సమాచారంపై టిక్ టాక్ యూజర్లు ఈ కొత్త ఫీచర్‌తో రిపోర్టు చేయొచ్చు

తప్పుడు సమాచారంపై టిక్ టాక్ యూజర్లు ఈ కొత్త ఫీచర్‌తో రిపోర్టు చేయొచ్చు

 

కరోనావైరస్ (COVID-19) వ్యాప్తిపై భారతదేశంలో తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవలే, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు వాస్తవాలు, తప్పుడు విషయాల మధ్య తేడాను గుర్తించేందుకు సాయపడుతోంది. భారతదేశంలో ఫ్యాక్ట్-చెకింగ్ ప్రొగ్రామ్ విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు టిక్‌టాక్ తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి యాప్‌లో రిపోర్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. 

టిక్‌టాక్ ఇన్-యాప్ రిపోర్టింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే? :


టిక్‌టాక్ కంపెనీ తప్పుడు సమాచారాన్ని కలిగి ఉన్న ఏదైనా వీడియోను గుర్తిస్తే.. ఇప్పుడు యాప్‌లోని కొత్త 'Misleading Information' కేటగిరిని ఎంచుకోవడం ద్వారా దాన్ని నివేదించవచ్చు. కంటెంట్ కరోనావైరస్ చుట్టూ ఉంటే యాప్‌లోని ఎంపికల నుండి 'COVID-19 Misinformation సబ్ కేటగిరీని ఎంచుకోవడం ద్వారా నివేదించవచ్చు.

టిక్‌టాక్ యూజర్ ఏదైనా కంటెంట్‌ను 'COVID-19 Misinformation' గా రిపోర్ట్ చేసినప్పుడు నేరుగా ప్రాయారిటీ మోడరేషన్ క్యూకు వెళ్తుంది. ఇంటర్నల్ టాస్క్‌ఫోర్స్ ద్వారా థర్డ్ పార్టీ ఫాక్ట్-చెకర్స్‌కు విస్తరిస్తుంది. టాస్క్‌ఫోర్స్ COVID-19 వ్యాప్తిపై తప్పుడు సమాచారాన్ని పరిష్కరించి నిర్ణయం తీసుకోవడంలో యాక్టివ్ యాక్షన్‌గా ఏర్పాటు చేసింది’ అని పేర్కొంది. ఈ కొత్త ఫంక్షనాల్టీ కోసం టిక్‌టాక్ జాగ్రన్ గ్రూపు ఫ్యాక్ట్ చెకింగ్  చేసే Vishvas Newsతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఫీచర్ టిక్‌టాక్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. రాబోయే రోజుల్లో అందుబాటులో రావొచ్చు. యాప్‌లో రిపోర్టింగ్ ఫీచర్ ఉపయోగించడానికి మీరు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుండి టిక్‌టాక్ తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు.