హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పై కేసు వేయబోతున్న టాలీవుడ్ నిర్మాతలు !!

హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పై కేసు వేయబోతున్న టాలీవుడ్ నిర్మాతలు  !!

సహజంగా హాలీవుడ్ వాళ్ళు తమ కథలను కాపీ కొట్టారని ఇండియన్ ప్రొడ్యూసర్స్ పై కేసులు వేయడం ఇప్పటి వరుకూ చూసాం.. విన్నాం. అందుకు భిన్నంగా మన తెలుగు నిర్మాతలు, హాలీవుడ్ నిర్మాతల పై పోరాటం చేయబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర లు
మన భారత మాజీ రాష్ట్రపతి గ్రేట్ అబ్దుల్ కలాం బయోపిక్ చేయడానికి, సన్నాహాలు చేస్తూ కలం గారి సోదరులని, మిగతా కుటుంబ సభ్యులను కలిసి అంగీకార పత్రాన్ని తీసుకున్నారు. 

దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ లోపు పింక్ జాగ్వార్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థలో హాలీవుడ్ దర్శక నిర్మాత జానీ మొర్టెన్, APJ అబ్దుల్ కలామ్ జీవిత చరిత్ర ఆధారంగా కమెడియన్ అలీ ప్రధాన పాత్రలో సినిమా తియ్యడం, ఈ మధ్యే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలిసిన తెలుగు నిర్మాతలు APJ అబ్దుల్ కలాం జీవితం పై సినిమా తీయడానికి పూర్తి హక్కులు మాకే ఉన్నాయని,
ఈ విషయం పై సదరు హాలీవుడ్ దర్శక నిర్మాత పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.