రేవంత్‌రెడ్డి పై ‘ఓటుకు నోటు’ సహా 36 కేసులు..!!

0
249
Revanth reddy Cases

కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పై ‘ఓటుకు నోటు’ కేసు తో కలిపి మొత్తం 36 కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. విచిత్రమేమిటంటే 2014 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం రేవంత్‌పై ఒక్క కేసు కూడా లేదు. ప్రస్తుత కేసుల్లో ఎక్కువగా శాంతిభద్రతలకు ఆటంకం కల్పిస్తాడనే అనుమానంతో ముందస్తు చర్యలో భాగంగా నమోదు చేసినవే ఉన్నాయి. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసుతో పాటు, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల నుంచి సీఎం కేసీఆర్‌ ముడుపులు తీసుకున్నట్లు చెప్పిన అంశంపై కేసులున్నాయి. ఇక, ఆయనకు చరాస్తులు రూ.1,74,97,421, స్థిరాస్తులు రూ.2,02,45,250 ఉన్నాయి. భార్య పేరిట చరాస్తులు రూ.2,27,78,935, రూ.2,43,30,000 స్థిరాస్తులున్నాయి. మార్కెట్‌ విలువ ప్రకారం ఆయన పేరిట రూ.7,69,69,650 ఆస్తులు, భార్య పేరిట రూ.9,44,64,000 ఆస్తులు ఉన్నాయి.