టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి సస్పెండ్

0
82
mlc k yadav reddy suspended

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడు పెంచింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని సస్పెండ్ చేస్తూ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. యాదవరెడ్డి గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ నుంచి యాదవరెడ్డిని బహిష్కరించడం వెనక ఆయన కూడా కొండా వెంట వెళతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.