ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు ముందుకొచ్చిన యూఏయూ

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు ముందుకొచ్చిన యూఏయూ

లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ ఐపీఎల్ ను నిర్వ‌హించేందుకు యూఏఈ క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది. ఈ విష‌యాన్ని బీసీసీఐ అధికారి అరుణ్ ధ‌మాల్ తెలిపారు, ఐపీఎల్ కు ఆతిథ్య‌మిస్తామ‌ని యూఏఈ ప్ర‌తిపాదించింద‌ని, ప్ర‌స్తుతం ఎలాంటి అంత‌ర్జాతీయ ర‌వాణా లేక‌పోవ‌డంతో ఎలాంటి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం లేద‌న్నారు. 

ఐపీఎల్ ను నిర్వ‌హించ‌డం యూఏఈకి కొత్తేమీ కాదు. భార‌త్ లో 2014 లో సార‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డే 20 మ్యాచ్ లు నిర్వ‌హించారు. ఇప్ప‌టికే శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే..

ఐపీఎల్ ను రీషెడ్యూల్ చేసేందుకు భార‌త్ ఎంత‌గానో ప్ర‌య‌త్నించింది. ఇప్ప‌టికే బ‌యో సెక్యూర్ స్టేడియాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది. అయితే దేశంలో అనేక‌రెడ్ జోన్లు ఉండ‌టంతో అది అంత‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. 2009 లో సౌత్ ఆఫ్రికా, 2014 ల మాదిరిగానే ఐపీఎల్ నిర్వ‌హించే ఆలోచ‌న ఉందా అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. త‌మకు ఆట‌గాళ్ళ భ‌ద్ర‌తే ముఖ్య‌మ‌ని చెప్పారు