అంతరిక్షంలో వరుణ్ తేజ్

0
12
anthariksam varun tej

ఫిదా , తొలిప్రేమ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న మెగా వరుణ్ తేజ్..ప్రస్తుతం ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంత‌రిక్షం ‘ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈరోజు స్వాతంత్య్ర దినోత్స‌వం సందర్భాంగా చిత్ర యూనిట్ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమా కోసం వరుణ్‌ వ్యోమగామిగా కనిపించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ చిత్రం లో వరుణ్‌ తేజ్ సరసన అదితి రావు జోడీకడుతుంది. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here