ఆర్ఆర్ఆర్ కి పోటీగా విజయ్ సినిమా

ఆర్ఆర్ఆర్ కి పోటీగా విజయ్ సినిమా

ఆర్ఆర్ఆర్  సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరి నోటా ఈ సినిమా పేరు వినిపిస్తుంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు శరవేగంగా సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని చిత్ర బృందం భావిస్తుంది. 

కాగా ఈ సినిమాకు పోటీగా తమిళ టాప్ హీరో విజయ్ సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సిద్దమవుతున్నారట. సుధ కొంగర దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో ఉంచేందుకు విజయ్ సిద్దమయ్యారట.. ఇదే జరిగితే ఆర్ఆర్ఆర్ కి తమిళంలో కొంత ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చని సినీ వర్గాల టాక్. విజయ్ పోటీకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నారా, లేక సంక్రాంతి కలిసొస్తుందని విడుదలకు సిద్దమవుతున్నారా అనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది.