ఒక్క వికెట్ కోసం వైటింగ్

jasprit bumrah 3rd test

భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు చేరింది. నాలుగో రోజే భారత్‌ గెలిచేందుకు బాగా చేరువైనా… ఆదిల్‌ రషీద్‌ (55 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, ఒక సిక్స్‌) పట్టుదలగా ఆడటంతో మరో రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (176 బంతుల్లో 106; 21 ఫోర్లు) శతకంతో చెలరేగగా… బెన్‌ స్టోక్స్‌ (187 బంతుల్లో 62; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. జస్‌ప్రీత్‌ బుమ్రా (5/85) కెరీర్‌ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్‌ రాహుల్‌ నాలుగు క్యాచ్‌లు పట్టాడు.